Allu Arha: ‘శాకుంతలం’ క్రేజ్.. వరుస చిత్రాల్లో అల్లు అర్హ.. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలోనూ ?..

|

Jan 29, 2023 | 5:14 PM

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏లో సింహాంపై ఎంట్రీ ఇచ్చిన అర్హ విజువల్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమ అభిమాన హీరో ముద్దులు కూతురు బిగ్ స్క్రీన్ పై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Allu Arha: శాకుంతలం క్రేజ్.. వరుస చిత్రాల్లో అల్లు అర్హ.. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలోనూ ?..
Allu Arha
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బన్నీతోపాటు.. ఆయన కుమార్తె అల్లు అర్హకు కూడా సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. తన కూతురు అర్హకు సంబంధించిన అల్లరి వీడియోస్.. ఫోటోస్ బన్నీ సతీమణి అల్లు స్నేహా ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంటారు. మరోవైపు చైల్డ్ ఆర్టిస్ట్‏గా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది అర్హ పాప. డైరెక్టర్ గుణశేఖర్, హీరోయిన్ సమంత కాంబోలో రాబోతున్న శాకుంతలం చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించనుంది అర్హ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏లో సింహాంపై ఎంట్రీ ఇచ్చిన అర్హ విజువల్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమ అభిమాన హీరో ముద్దులు కూతురు బిగ్ స్క్రీన్ పై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇధిలా ఉంటే.. ఇక అర్హకు ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మహేష్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టులో అర్హ ఓ రోల్ చేయబోతుందని టాక్ వినిపించింది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా చేయనుందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాలో అర్హ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ త్వరలోనే కంప్లీట్ కానుంది. ఈ సినిమా తర్వాత పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేయనున్నాడు.

కోలీవుడ్ హిట్ మూవీ తెరకి అఫీషియల్ రీమేక్ అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ కూతురుగా మీనా కుమార్తె నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకం. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కూతురిగా అర్హ నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.