AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Aravind: ప్రతి అడపిల్ల తన తండ్రులని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళాలి.. అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్

హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది.

Allu Aravind: ప్రతి అడపిల్ల తన తండ్రులని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళాలి.. అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్
Allu Aravind
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2023 | 6:43 PM

Share

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హిట్ 2 సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన సుహాస్ ఇప్పుడు హీరోగా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘సెలబ్రేటింగ్‌ హౌస్‌ఫుల్‌’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రైటర్ పద్మభూషణ్ సినిమా చూసిన తర్వాత ఇది తప్పకుండా మేము రిలీజ్ చేయాల్సిన సినిమా అనిపించింది. ప్రతి అడపిల్ల తన తండ్రులని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళాలి. అడ పిల్ల మనసులో ఏముందో, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ళ మనసులోకి తొంగి చూసి వాళ్ళ కలలని తీర్చడానికి ఈ సినిమా మహత్తరంగా ఉపయోగపడే సినిమా. అందుకే కుటుంబం అంతా కలసి రైటర్ పద్మభూషణ్ ని చూడాలి. సినిమా చివర్లో అడపిల్లల కలలని గురించి, వారి ఇష్టాలు గురించి ఇంత అద్భుతంగా తెరపై ఆవిష్కరించడం చాలా ఆనందాన్ని ఇచింది. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడాన్ని నేను ఒప్పుకోను. అది వ్యక్తిగతంగా ఇష్టం వుండదు. ఈ సినిమా చూసిన తర్వాత మా ఆవిడని నువ్వు ఏం కావాలని అనుకున్నావ్ ? అని అడిగాను. దర్శకుడు ప్రశాంత్ గొప్ప సినిమా తీశాడు. సుహాస్ కలర్ ఫోటో ఆహాలో ఫస్ట్ హిట్. సుహాస్ చాలా సహజమైన నటుడు. శరత్, అనురాగ్, చంద్రు .. వీళ్ళంతా గోల్డెన్ టీం. టీనా, గౌరీ ప్రియ చాలా చక్కగా నటించారు. మ్యూజిక్, ఎడిటింగ్.. అన్నీ అద్భుతంగా వున్నాయి. మళ్ళీ అడపిల్లల అందరికీ చెబుతున్నా మీ తల్లితండ్రులని అన్నదమ్ములని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

సుహాస్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పండుగ, కలర్‌ ఫొటో.. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్‌’ ..ఇలా నన్ను ఎంతోగానో సపోర్ట్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. హౌస్ ఫుల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మా సినిమాకి హౌస్ ఫుల్స్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అనురాగ్, శరత్ అన్నకి థాంక్స్. వాళ్ళు ఛాయ్ బిస్కెట్ పెట్టకపోయి వుంటే మేము వుండేవాళ్ళం కాదు. చంద్రు గారికి కృతజ్ఞతలు. మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ కి థాంక్స్. టీనా, గౌరీ కి థాంక్స్. ఈ సినిమాలో నా ఫ్రండ్ పాత్ర చేసిన ప్రవీణ్ నటనకు కూడా మంచి రెస్పాన్ రావడం అనందంగా వుంది. ఛాయ్ బిస్కెట్ టీం కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు.