Vismaya Mohanlal: సినిమాల్లోకి మోహన్‌లాల్ కూతురు.. పూజా కార్యక్రమాలతో మొదలైన విస్మయ మొదటి సినిమా.. ఫొటోస్ వైరల్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూతురు సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆమె మొదటి సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి విస్మయ కూడా తండ్రిలాగే సూపర్ స్టార్ గా ఎదుగుతుందేమో చూడాలి.

Vismaya Mohanlal: సినిమాల్లోకి మోహన్‌లాల్ కూతురు.. పూజా కార్యక్రమాలతో మొదలైన విస్మయ మొదటి సినిమా.. ఫొటోస్ వైరల్
Mohanlal daughter Vismaya Mohanlal

Updated on: Oct 31, 2025 | 8:44 AM

మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ నటుడి సినిమాలకు ఇక్కడ కూడ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆయన కూతురు విస్మయ మోహన్ లాల్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తుడక్కమ్ అనే సినిమాతో విస్మయ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొచ్చిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో హీరో మోహన్‌లాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఆయన సతీమణి సుచిత్ర, కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ తో సహా పలువుర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. విస్మయతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సారాస్‌, 2018 వంటి సూపర్ హిట్ చిత్రాల ను తెరకెక్కించిన దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇప్పుడు మోహన్ లాల్ కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. మోహన్‌లాల్‌ అత్యంత సన్నిహితులైన ఆంటోనీ పెరుంబావూర్ నేతృత్వంలోని ఆశీర్వాద్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విస్మయతో పాటు ఆంటోనీ పెరుంబావూర్ కుమారుడు ఆశీష్ ఆంటోనీ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించ‌బోతున్నాడు. ప్రస్తుతం తుడక్కమ్ సినిమా లాంఛింగ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విస్మయతో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఇక విస్మయ విషయానికి వస్తే.. ఇప్పటికే రచయితగా రాణిస్తోందీ స్టార్ కిడ్. ఆమె తొలి పుస్తకం ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల అయ్యింది. విస్మయ మార్షల్ ఆర్ట్స్ లోనూ నైపుణ్యం సాధించింది. థాయ్‌లాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. చాలా రోజుల నుంచే ఆమె ఇండస్ట్రీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారికంగా ఆమె మొదటి సినిమా ప్రారంభమైంది. కాగా విస్మయ సోదరుడుమోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఇప్పటికే  హీరోగా రాణిస్తున్నాడు. జీతు జోసెఫ్ తెరకెక్కించిన ‘ఆది’మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు ప్రణవ్. ప్రస్తుతం ఈ హీరో కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. 

పూజా కార్యక్రమాలతో మొదలైన విస్మయ మోహన్ లాల్ మొదటి సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.