Alia Bhatt : అలియా భట్.. తన కూతురు ఫెవరేట్ సాంగ్ ఎదో చెప్పింది

ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఆమె నటించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రం తెలుగులో డబ్‌గా విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అలియా నటించింది.

Alia Bhatt : అలియా భట్.. తన కూతురు ఫెవరేట్ సాంగ్ ఎదో చెప్పింది
Alia Bhatt
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 10, 2024 | 12:13 PM

బాలీవుడ్ నటి అలియా భట్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలియా భట్ నటించిన ‘జిగ్రా’ ఈ వారం విడుదలవుతోంది. ఈ చిత్రానికి అలియానే నిర్మాత కూడా. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం అలాగే తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ విడుదల చేస్తోంది. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం అలియా భట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం తెలుగులో డబ్‌గా విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అలియా నటించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత అలియా సినిమా తెలుగులో విడుదల కావడం ఇదే తొలిసారి.

ఈ కారణంగానే హైదరాబాద్‌లో జరిగిన ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అలియా భట్ హాజరైంది. ఈ కార్యక్రమానికి సమంత, రానా అతిధులుగా హాజరయ్యారు.  ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట గురించి అలియా మాట్లాడింది. మా ఇంట్లో ఎప్పుడూ నాటు నాటు పాటలు ప్లే చేస్తూ ఉంటాం. మా కూతురు రాహా ఈ పాటకి పెద్ద ఫ్యాన్. ఆమెకు పాటలు వినడమే కాదు, డ్యాన్స్ చేయడం కూడా ఇష్టం. నాటు నాటు పాటకు డ్యాన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఆ పాట నాకు చాలా ప్రత్యేకం’ అని చెప్పింది అలియా.

అలియా భట్ నటించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రెగ్నెన్సీ తర్వాత అలియాకు పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు ఆమె నటించిన ‘జిగ్రా’ విడుదలవుతోంది. ఇది కాకుండా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో నటిస్తోంది అలియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.