Naa Saami Ranga Pre Release Event : ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సంక్రాంతి పండక్కి కిష్టయ్య మాస్ జాతరే..
ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సార్ థిల్లాన్ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఈసారి సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ట్రైలర్ తోనే సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇందులో నాగ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న నాగార్జున

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘నా సామిరంగ’. డైరెక్టర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సార్ థిల్లాన్ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఈసారి సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ట్రైలర్ తోనే సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇందులో నాగ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న నాగార్జున ఖాతాలో ఈసారి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే నెట్టింట నా సామిరంగ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఈరోజు (బుధవారం) నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో నిర్వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.