నాగచైతన్య ఏడిపించేశాడు భయ్యా.. గాయపడిన మనసు మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది..

నాగ చైతన్య తొలి సినిమాతోనే యువతకు బాగా దగ్గరయ్యాడు. ఆతర్వాత ఏం మాయ చేశావే సినిమాతో  సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగ్ చైతన్య. చేసింది తక్కువ సినిమాలే అయినా.. వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు నాగ చైతన్య.

నాగచైతన్య ఏడిపించేశాడు భయ్యా.. గాయపడిన మనసు మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది..
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2024 | 4:52 PM

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగ చైతన్య. జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన నాగ చైతన్య తొలి సినిమాతోనే యువతకు బాగా దగ్గరయ్యాడు. ఆతర్వాత ఏం మాయ చేశావే సినిమాతో  సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగ్ చైతన్య. చేసింది తక్కువ సినిమాలే అయినా.. వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు నాగ చైతన్య. మజిలీ, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఇటీవలే దూత అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు నాగ చైతన్య. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో..

అయితే నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. నాగ చైత్యన స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఉంహించని విధంగా విడిపోయి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. కారణాలు తెలియవు కానీ ఇద్దరూ విడిపోయి అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. ఆతర్వాత సమంత మాయోసైటిస్ బారిన పడటం..  సినిమాలకు గ్యాప్ ఇవ్వడం జరిగింది.

నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైత్యనకు సంబందించిన ఓ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాగ్ చైతన్య చెప్పిన మాటలు మనసుకు హత్తుకుంటున్నాయి. ఈ వీడియోలో నాగ చైతన్య మాట్లాడుతూ.. గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది.. ఎవరికైనా ఆ ఎమోషన్ అర్ధమవుతుంది. మన ఫ్రెండ్స్ అయినా.. ఫ్యామిలీకైనా ఏదైన జరిగితే మన లోపల ఉండే  ఫైర్ వేరే ఉంటుంది. ఆ టైం లో మనం రియాక్ట్ అయినప్పుడు చాలా జన్యున్ గా రియాక్ట్ అవుతాం.. ఒక ఇంటెన్సిటీ తో రియాక్ట్ అవుతాం అంటూ తెలిపారు నాగ చైతన్య. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by GSR Talks (@gsr_talks)

 నాగ చైతన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.