Akkineni Family- Sonu Sood: వరద బాధితులకు అండగా అక్కినేని కుటుంబం, సోనూ సూద్.. ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..

ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, ఆయ్ మూవీ టీం, ప్రొడ్యూసర్స్, హీరోయిన్ అనన్య నాగళ్ల వంటి తారలు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ విరాళాలు ఇవ్వడం స్టార్ట్ చేయగా.. అత్యధికంగా ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. తాజాగా అక్కినేని కుటుంబం, రియల్ హీరో సోనూ సూద్, కమెడియన్ ఆలీ వరద బాధితులకు అండగా నిలబడ్డారు.

Akkineni Family- Sonu Sood: వరద బాధితులకు అండగా అక్కినేని కుటుంబం, సోనూ సూద్.. ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..
Akkineni Family
Follow us

|

Updated on: Sep 04, 2024 | 4:13 PM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మం, విజయవాడలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నా్రు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాయం చేసేందుకు సినీతారలు ముందుకు వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి స్టార్ హీరోలు పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, ఆయ్ మూవీ టీం, ప్రొడ్యూసర్స్, హీరోయిన్ అనన్య నాగళ్ల వంటి తారలు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ విరాళాలు ఇవ్వడం స్టార్ట్ చేయగా.. అత్యధికంగా ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. తాజాగా అక్కినేని కుటుంబం, రియల్ హీరో సోనూ సూద్, కమెడియన్ ఆలీ వరద బాధితులకు అండగా నిలబడ్డారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ. కోటి సాయంగా అందించింది అక్కినేని కుటుంబం. ” అక్కినేని నాగేశ్వరరావుగారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం. సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం” అంటూ ప్రకటన రిలీజ్ చేశారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్‏ని అందజేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే రియల్ హీరో సోనూ సూద్ కూడా వరద బాధితులకు అండగా నిలబడ్డారు. మంచి నీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతోపాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అలాగే కమెడియన్ ఆలీ కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు వరదల వల్ల ఎంతగా నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని చూసి నేను నా భార్య జుబేదా ఎంతో బాధపడ్డాం. మా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరు లక్షల (ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణాకు 3 లక్షలు) రూపాయలను సీయం రిలీఫ్‌ ఫండ్‌కు అందచేస్తాం అని ప్రముఖ నటుడు అలీ అన్నారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా తెలంగాణ రాష్ట్రా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.20 లక్షలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది.

సోనూ సూద్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.