Agent Movie: సంక్రాంతి రేసు తప్పుకున్న మరో హీరో.. ఆ కారణంతోనే ఏజెంట్ మూవీ వాయిదా ?..

|

Nov 09, 2022 | 7:44 AM

డార్లింగ్ దారిలోనే అక్కినేని అఖిల్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తోన్న ఏజెంట్ చిత్రం రిలీజ్ వాయిదా పడనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Agent Movie: సంక్రాంతి రేసు తప్పుకున్న మరో హీరో.. ఆ కారణంతోనే ఏజెంట్ మూవీ వాయిదా ?..
Agent Movie
Follow us on

సంక్రాంతి రేసులో అగ్రకథానాయకులు పోటీ పడనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ.. ప్రభాస్.. అక్కినేని అఖిల్ వంటి స్టార్ హీరోస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఇటీవల ఈ రేసు నుంచి యంగ్ రెబల్ స్టార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఓంరౌత్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ చిత్రం వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక డార్లింగ్ దారిలోనే అక్కినేని అఖిల్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తోన్న ఏజెంట్ చిత్రం రిలీజ్ వాయిదా పడనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం అఖిల్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇటీవలే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ మూవీ ఆగస్ట్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్స్ దొరక్కపోవటం వంటి కారణాలతో ఏజెంట్ వాయిదా వేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో అఖిల్ సరసన ముంబై బ్యూటీ సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో అఖిల్ స్పైగా కనిపించనున్నారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి.