
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణకు చెందిన కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరికి కూడా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. వీరితో పాటు సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ ఈ మూవీలో తన విలనిజంతో ఆడియెన్స్ న భయపెట్టాడు. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చాలా పరిమితమైన బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.17 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ షాక్ కు గురిచేసింది. థియేటర్లలో ఈ సినిమాను చూసి చాలామంది ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వచ్చారు. ఇలా ప్రేక్షకుల మనసులను కదిలించిన ఈ హార్ట్ టచింగ్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది.
. రాజు వెడ్స్ రాంబాయి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా ఈ సినిమానునిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. శివాజీ రాజా, అనిత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బలి సంగీతం అందించారు.
STREAMING NOW 🚨
Theatres lo create chesina chaos…
📺 ippudu mee screens lo full blast.Raju Weds Rambai – EXTENDED CUT
Dolby Atmos & Dolby Vision
Press play.
Let the house shake.@venuudugulafilm @rahulmopidev @Monsoontal2444 @TheBunnyVas @connect2vamsi @akhilrajuddemari… pic.twitter.com/ZHpahO2MoO— ETV Win (@etvwin) December 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.