Agent: అసలు ఏజెంట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా..?

|

Jun 26, 2023 | 10:41 AM

అఖిల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది.

Agent: అసలు ఏజెంట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా..?
agent
Follow us on

అక్కినేని అఖిల్ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఏ సినిమా చేసిన అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి యాక్షన్ డైరెక్టర్ వివినాయక్ దర్శకత్వంతో హీరోగా పరిచయం అయ్యాడు. అఖిల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అలాగే ఆ వెంటనే వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాతో వచ్చాడు ఈ సినిమా కూడా నిరాశపరిచింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్. ఆ సినిమా ఈ అక్కినేని హీరో ఖాతలో పడలేదు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది.

ఏజెంట్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా సిక్స్ బాడీను కూడా పెంచాడు. అలాగే లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో అఖిల్ ఫ్యాన్స్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఏజెంట్ సినిమా ఓటీటీల్లోకి వస్తుందని టాక్ వచ్చింది. కానీ రాలేదు. దాంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఏజెంట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది.. వస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే థియేటర్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో అలరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఏజెంట్ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.