Agent Vs Ponniyin Selvan 2: అక్కినేని యంగ్ హీరో వర్సెస్‌ మణిరత్నం.. గెలుపెవరిదో మరి..

ఇంతకీ ఎవరు వారు అంటున్నారా? ఇంకెవరు? స్పై వర్సెస్‌ చోళులు.. అదేనండీ ఏజెంట్‌ వర్సెస్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. ఓరుగల్లు వేదికగా జరిగింది అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌. యాక్షన్‌ సినిమాలంటే నాకు పిచ్చి.

Agent Vs Ponniyin Selvan 2: అక్కినేని యంగ్ హీరో వర్సెస్‌ మణిరత్నం.. గెలుపెవరిదో మరి..
Agent Vs Ps2

Updated on: Apr 25, 2023 | 3:15 PM

నిన్నమొన్నటిదాకా ముందూ వెనుకాలా ఉన్నవారు.. ఇప్పుడు గ్రౌండ్‌లో గట్టిగా తలపడుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో జరిగే సమరానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఎవరు వారు అంటున్నారా? ఇంకెవరు? స్పై వర్సెస్‌ చోళులు.. అదేనండీ ఏజెంట్‌ వర్సెస్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. ఓరుగల్లు వేదికగా జరిగింది అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌. యాక్షన్‌ సినిమాలంటే నాకు పిచ్చి. అందుకే అంత ఇష్టపడి ఈ సినిమా చేశానంటూ ఓపెన్‌గా చెప్పేశారు అక్కినేని యువ హీరో. ఏప్రిల్‌ 28న విడుదల కానుంది ఏజెంట్‌. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ఏజెంట్‌. స్పై థ్రిల్లర్‌గా రూపొందించారు మేకర్స్. ఈ సారి హిట్‌ పక్కా అని కాన్ఫిడెంట్‌గా ఉంది అక్కినేని కాంపౌండ్‌.

అటు పొన్నియిన్‌ సెల్వన్‌ టీమ్‌ కూడా భాగ్యనగరంలో ల్యాండ్‌ అయింది. ఆల్రెడీ అన్ని మెట్రో సిటీస్‌ని కవర్‌ చేసిన మణిరత్నం మెగాటీమ్‌ తెలుగు మీద జాగ్రత్తగా ఫోకస్‌ చేస్తోంది. బరిలో అక్కినేని అఖిల్‌ సినిమా సాలిడ్‌ పోటీ ఇస్తుండటంతో ఈ స్పెషల్‌ ఫోకస్‌ తప్పట్లేదు టీమ్‌కి. చోళాస్‌ ఆర్‌ బ్యాక్‌ అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు మణిరత్నం. దానికి తగ్గట్టుగానే, ఏ సిటీకి వెళ్లినా విక్రమ్‌, త్రిష, కార్తి, జయం రవి తమదైన గ్రేస్‌ని మెయింటెయిన్‌ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 500 కోట్లు కలెక్ట్ చేసింది పొన్నియిన్‌ సెల్వన్‌. ఇప్పుడు సెకండ్‌ పార్టు అందుకు మూడింతలు చేస్తుందన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ దగ్గర.

పీయస్‌2 టీమ్‌ మొత్తం పీయస్‌1 విజయోత్సాహంతో ముందుకు నడుస్తుంటే, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు అఖిల్‌. స్పై కేరక్టర్‌లో స్టైలిష్గా కనిపిస్తున్నారు అఖిల్‌. ఏజెంట్‌లో మమ్ముట్టి కీ రోల్‌ చేశారు. ఏజెంట్‌ వర్సెస్‌ పొన్నియిన్‌ సెల్వన్‌లో హిట్‌ జోష్‌ ఎవరిదో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు వెయిటింగ్‌ తప్పదు మరి.