Aishwarya Rajesh : ”జీవితం చాలా పాఠాలు నేర్పింది”.. ఐశ్వర్య రాజేష్ కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు

|

Aug 16, 2022 | 3:28 PM

సినిమాల్లో అందాలు ఆరబోస్తూ నవ్వుతూ కనిపించే హీరోయిన్స్ జీవితంలో చాలా ఒడిడుకులు ఉంటాయి. చాలా మంది తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

Aishwarya Rajesh : జీవితం చాలా పాఠాలు నేర్పింది.. ఐశ్వర్య రాజేష్ కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Aishwarya Rajesh
Follow us on

సినిమాల్లో అందాలు ఆరబోస్తూ నవ్వుతూ కనిపించే హీరోయిన్స్ జీవితంలో చాలా ఒడిడుకులు ఉంటాయి. చాలా మంది తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న కష్టాలగురించి చెప్పుకొచ్చారు. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh )తమిళ్ లో హీరోయిన్ గా దూసుకుపోతోంది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్య ఆతర్వాత హీరోయిన్ గా ఎదిగింది. తమిళ్ తోపాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఐశ్వర్య మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా.. నా ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయా ని ఎమోషనల్ అయ్యింది.

ఊహ తెలిసిన వెంటనే తండ్రిని కోల్పోయా.. ఆ తర్వాత అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు అని చెప్పుకొచ్చింది. జీవితం తనకు చాలా పాఠాలు నేర్పిందని.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. రాక ముందుకూడా తన చాలా ఎదురుదెబ్బలు తగిలాయని అంది ఐశ్వర్య రాజేష్. స్టార్ హీరోయిన్ అవ్వకపోయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడ్డానని, తన సినిమాలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలని అనుకున్నానని చెప్పుకోచ్చింది ఈ బ్యూటీ. ఐశ్వర్య నటించిన కాక్కా ముట్టై సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కనా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో చివరిగా టక్ జగదీశ్ సినిమాతో అలరించింది ఐశ్వర్య రాజేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.