Aradhya Bachchan: ఏంటీ..! ఐశ్వర్య రాయ్ కూతురు సర్జరీ చేయించుకుందా.?

ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు విదేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మూడు రోజుల పాటు జరిగింది.

Aradhya Bachchan: ఏంటీ..! ఐశ్వర్య రాయ్ కూతురు సర్జరీ చేయించుకుందా.?
Aradhya Bachchan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 06, 2024 | 12:44 PM

ముకేశ్ అంబానీ , నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లివేడుక ఇటీవల ఘనంగా జరిగింది.. ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరిగింది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు విదేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మూడు రోజుల పాటు జరిగింది. అతిథులకు ప్రత్యేక వసతి, భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి బచ్చన్ ఫ్యామిలీ అంతా వచ్చారు. వీరిలో ఐష్ కూతురు ఆరాధ్య లుక్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

అంబానీ ఇంటి కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆరాధ్య బచ్చన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఆరాధ్యను ఇలా చూడటం ఇదే మొదటిసారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఆరాధ్య బచ్చన్ ప్రతిసారీ ఒకే హెయిర్‌స్టైల్‌లో కనిపించేది. అయితే అంబానీ పార్టీలో ఆరాధ్య బచ్చన్ భిన్నంగా కనిపించింది. ఆమె మొఖంలో చాలా మార్పు కనిపించింది. ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పును చూసి, చాలా మంది ఆరాధ్య బచ్చన్‌ శస్త్రచికిత్స చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఆరాధ్య బచ్చన్ ఇప్పుడు చూస్తే ప్లాస్టిక్ సర్జరీ  చేయించుకుందా..? అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఆరాధ్య ఇలా లేదు.  ఇప్పుడు కనిపించే తీరులో చాలా మార్పు వచ్చింది. ఆరాధ్యకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆరాధ్య వయసు 12 ఏళ్ల 3 నెలలు మాత్రమే. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పలువురు అంటున్నారు. హెయిర్ స్టైల్, మేకప్ వల్ల ఆరాధ్య లుక్ మారిపోయిందని మరి కొందరు అంటున్నారు. ఆరాధ్య బచ్చన్ కొద్ది రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్లింది. అప్పుడే ఆరాధ్య బచ్చన్ సర్జరీ చేయించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..