02 March 2025

స్కూల్లో టాపర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాదిలో స్టార్ హీరోలకు ఉన్నంత రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

సినిమాలో హీరోతోపాటు ఆమె పాత్రకు సైతం ప్రాధాన్యత ఉండాల్సిందే. బాక్సాఫీస్ క్వీన్ అన్న బిరుదు సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నటిస్తూ ఫేమస్ అయ్యింది. 

గతేడాది సూపర్ హిట్.. ఈ ఏడాది మరో హిట్ అందుకుని ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. స్కూల్లో ఆమె టాపర్. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు తీసుకుంటుంది. 

ఆమె మరెవరో కాదు.. సాయి పల్లవి కేవలం నటనలోనే కాదు.. చదువులోనూ తోపే. ఆమెకు పదో తరగతిలో 80 శాతం, ఇంటర్ లో 85 శాతం మార్కులు వచ్చాయి. 

చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్న ఆమె.. ఇంటర్ తర్వాత నేరుగా ఎంబీబీఎస్ చేసి డాక్టర్ పట్టా తీసుకుంది. కానీ అనుహ్యంగా సినిమాల్లోకి వచ్చింది. 

ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. గతేడాది అమరన్ మూవీతో హిట్టు అందుకుంది. 

ఇటీవలే తండేల్ సినిమాతో మరో హిట్ అందుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. 

ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తుంది. రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ మూవీకి సాయి పల్లవి రూ.30 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్.