ఆ సమయంలో మందు తాగే అలవాటు ఉంది.. ఫ్యాన్స్‌కు హీరోయిన్ షాక్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుని మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగులో ఆఫర్స్ రావట్లేదు.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.
అలాగే తనకు కేరళ స్టైల్ ఫుడ్ అంటే ప్రాణమని.. సినిమాల్లో ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలు తెలియచేసే సినిమాలు రావాలని మనసులో మాట బయటపెట్టింది.
తెలుగు సినిమాలలో హీరోయిన్లను గ్లామరస్ గా చూపించినా.. సెట్స్ బయట లేడీ ఆర్టిస్టులతో ప్రవర్తించినంత మర్యాదగా మరే భాషా రంగంలో ఉండదని తెలిపింది.
తను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానని చెప్పి షాకిచ్చింది. అయితే అన్నీ పార్టీల్లో కాకుండా కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటుందట.
నందమూరి బాలకృష్ణతో తాను ఓ జ్యూవెల్లరీ యాడ్ చేశానని.. అప్పుడే ఆయనతో కలిసి నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని అనుకుందట. కానీ ఇప్పుడు వచ్చింది.
బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 సినిమాలో సంయుక్తకు ఛాన్స్ రావడంతో ఎంతో ఎగ్జైయిట్మెంట్ ఫీల్ అయ్యానని.. అలాగే మరో సినిమాకు ట్రైనింగ్ తీసుకుంటుందట.