మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. విక్రమ్ నటుడు అర్జున్ దాస్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. హార్ట్ సింబల్ జత చేసింది ఐశ్వర్య. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ఈరోజు ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్షణాల్లోనే వీరి ప్రేమ పుకార్లు నెట్టింట్లో హల్చల్ చేశాయి. దీంతో వీరి పిక్ చూసి అభిమానులు షాకవ్వగా.. సెలబ్రెటీలు మాత్రం కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా తన ప్రేమ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య. తాను షేర్ చేసిన ఓ ఫోటో ఇంత రచ్చ చేస్తుందనుకోలేదంటూ తన ఇన్ స్టా స్టోరీలో వివరణ ఇచ్చింది. గురువారం సాయంత్రం తన ఇన్ స్టా స్టోరీ ప్రేమ.. అర్జున్ తో కలిసి దిగిన ఫోటో గురించి రాసుకొచ్చింది.
“నేను పెట్టిన ఆ పోస్ట్ ఇంత రచ్చకు దారి తీస్తుందని నేను అనుకోలేదు. మేము ఇద్దరం కలిశాం. అప్పుడు ఓ ఫోటో తీసుకున్నాం. అందులో అంతకంటే ఏం లేదు. కేవలం మేము స్నేహితులం మాత్మరే. నిన్నటి నుంచి నాకు కంటిన్యూగా మెసేజ్ లు చేస్తున్న అర్జున్ దాస్ ఫ్యాన్స్ అందరూ నిశ్చితంగా ఉండండి. అతను పూర్తిగా మీవాడే ” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఐశ్వర్య.. అర్జున్ దాస్ ప్రేమ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఐశ్వర్య… ఇటీవల మట్టీ కుస్తీ సినిమాతో మరోసారి హిట్ ఖాతాలో వేసుకుంది. 2022లోనే ఏకంగా 9 చిత్రాల్లో నటించింది ఐశ్వర్య. ఇక అర్జున్ దాస్.. ఖైదీలో సినిమాలో విలన్ క్యారెక్టర్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ సినిమాల్లో నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.