Aha : అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే

|

Sep 26, 2024 | 6:25 PM

అదిరిపోయే గేమ్ షోస్, ఇంట్రెస్టింగ్ టాక్ షోలతో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అంతే కాదు ఒరిజినల్ వెబ్ సిరీస్ లతోనూ ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది ఆహ. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర వెబ్ సిరీస్ కు సంబందించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది ఆహా టీమ్.

Aha : అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే
Arthamainda Arun Kumar
Follow us on

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఎన్నో సూపర్ హాట్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆకట్టుకునే వెబ్ సిరీస్‌‌‌ లో కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అదిరిపోయే గేమ్ షోస్, ఇంట్రెస్టింగ్ టాక్ షోలతో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అంతే కాదు ఒరిజినల్ వెబ్ సిరీస్ లతోనూ ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది ఆహ. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర వెబ్ సిరీస్ కు సంబందించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది ఆహా టీమ్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 రాబోతుంది. అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

ఓ యువకుడు కార్పోరేట్ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలు. ఒడిదుడుకులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  సీజన్ 1 మంచి విజయం సాధించడంతోపాటు ఆహా ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 1లో హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ అలాగే క్రేజీ బ్యూటీ తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

ఇక ఈ సిరీస్ సీజన్ 2లో ఆసక్తికర కథ, కథనంతో పాటు అరుణ్ కుమార్ ప్రయాణంలో వచ్చే కొత్త పాత్రలు అలాగే ఉత్తేజకరమైన సర్ప్రైజ్‌లు ప్రేక్షకులును మెప్పించనున్నాయి. అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ నిర్మించిన అర్థమైంద అరుణ్ కుమార్ మరింతగా మెప్పించనుందని అంటున్నారు. ఈ సీజన్ 2లో అరుణ్ కుమార్‌కి ఎలాంటి కొత్త సవాళ్లు ఎదుర్కోబోతున్నాడో తెలుసుకోవడానికి అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి .

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.