Stand Up Rahul : కుర్రహీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ఈ యంగ్ హీరో `స్టాండప్ రాహుల్` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్ ఈ మూవీ. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.
జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది. ఈ సినిమాలో అందాల భామ వర్ష బొలమ్మ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ మూవీలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఏప్రిల్ 8, 2022 నుండి ఆహాలో ప్రీమియర్‌గా రాబోతుంది. ఆహాలో ఇటీవలే భీమ్లా నాయక్, డీజే టిల్లు, తెలుగు ఇండియన్ ఐడల్, సెబాస్టియన్, ఖుబూల్ హై?, అర్జున ఫాల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, 3 రోజెస్, మంచి రోజులోచై, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అనుభవించు రాజా, సర్కార్, చెఫ్ మంత్ర, అల్లుడు గారు, అలాగే క్రిస్మస్ తాత వంటివి అలరిస్తున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ఆహా టాక్ షో, అన్‌స్టాపబుల్, IMDBలో 1 టాక్ షోగా నిలిచింది.