AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavithra Gowda : ట్విస్టుల మీద ట్విస్టులు.. హీరో దర్శన్ ప్రియురాలు అరెస్ట్.. పోలీసుల అదుపులో నటి పవిత్ర గౌడ..

ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్శన్ ప్రియురాలు కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్రదుర్గలోని అపోలో ఫార్మసీ బ్రాంచ్‏లో పనిచేసే రేణుకాస్వామి అనే వ్యక్తి బెంగుళూరులోని సుమనహళి వంతెన వద్ద శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Pavithra Gowda : ట్విస్టుల మీద ట్విస్టులు.. హీరో దర్శన్ ప్రియురాలు అరెస్ట్.. పోలీసుల అదుపులో నటి పవిత్ర గౌడ..
Pavithra Gowda, Darshan
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2024 | 6:46 PM

Share

కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా హీరో దర్శన్‏ను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శన్‏తోపాటు మరో పది మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్శన్ ప్రియురాలు కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్రదుర్గలోని అపోలో ఫార్మసీ బ్రాంచ్‏లో పనిచేసే రేణుకాస్వామి అనే వ్యక్తి బెంగుళూరులోని సుమనహళి వంతెన వద్ద శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకస్వామి అసభ్యకరమైన మెసేజ్‏లు పంపాడని.. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకెళ్లగా తన అనుచరులతో కలిసి రేణుకస్వామిని కిడ్నాప్ చేయించి హత్య చేశాడు.

హత్య అనంతరం రేణుకస్వామి మృతదేహాన్ని బెంగుళూరులోని కామాక్షి పాళ్యం వద్ద కాల్వలో పడేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించడాని తేలడంతో ఈరోజు ఉదయం జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో దర్శన్‍ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు పోలీసులు. రేణుకస్వామి హత్యకు కుట్ర పన్నారనే అనుమానంతో పవిత్ర గౌడను అదుపులోకి తీసుకున్నారు బెంగుళూరు పోలీసులు. ఆమెతోపాటు మరికొందరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్శన్ తోపాటు పవిత్ర గౌడను మైసూరు నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దర్శన్ చెప్పినందుకే తాము ఈ నేరానికి పాల్పడ్డామని నిందితులలో ముగ్గురు చెప్పినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.