యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలోనూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. రామయ్యగా ప్రభాస్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ కాంట్రవర్సియల్ ఫిల్మ్ గా ట్యాగ్ ను సొంతం చేసుకున్నదని చెప్పవచ్చు. రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ సంచలన రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో దూసుకుపోతోంది. మొత్తంగాకూడా.. 100 మిలియన్ రికార్డ్ కూడా కొట్టేసింది.
అవును బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి అందర్నీ తెగ ఆకట్టుకుంది. వాల్మీకి రామాయణంలోని రాముని కథనే.. సరికొత్తగా.. విజువల్ వండర్‌గా చూపిస్తున్నారనే టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ ట్రైలర్ తాజాగా 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ..బాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అన్ని భాషల్లో వచ్చిన వ్యూస్ కలుపుకుని 100 మిలియన్ వ్యూస్ చేరుకుంది. ఈ ఫీట్ తో.. మరో సారి ప్రభాస్ క్రేజ్ అండ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ గానే ఆదిపురుష్ ట్రైలర్ కొనసాగుతుంది.
ఆదిపురుష’ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో దీన్ని కట్ చేశారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..