AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్ రామాయణం కాదు’.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు..

ఆదిపురుష్' మూవీకి వరుస వివాదాలు చుట్టుముట్టాయి. నిన్న మొన్నటి వరకు సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలనుకున్న ఫ్యాన్స్..

Adipurush: 'ఆదిపురుష్ రామాయణం కాదు'.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు..
Adipurush
Ravi Kiran
|

Updated on: Jun 18, 2023 | 12:00 PM

Share

‘ఆదిపురుష్’ మూవీకి వరుస వివాదాలు చుట్టుముట్టాయి. నిన్న మొన్నటి వరకు సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలనుకున్న ఫ్యాన్స్.. చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో.. దర్శకుడు ఓం రౌత్, చిత్ర బృందంపై మండిపడుతున్నారు. తమ హీరోను సరిగ్గా చూపించలేదని కొందరు, డైలాగ్స్ బాగోలేవని మరికొందరు, విఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉందని గ్రాఫిక్స్ లవర్స్.. ఇలా అన్ని రకాలుగా ఫ్యాన్స్ నుంచి ఆదిపురుష్ చిత్ర యూనిట్ విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ నేపధ్యంలో ఆ చిత్ర రచయిత మనోజ్ ముంతశీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆదిపురుష్ రామాయణం కాదని.. దాని నుంచి తాము కేవలం ప్రేరణ పొంది కథను రాసుకున్నామని’ మనోజ్ తెలిపారు. ఈ విషయాన్ని సైతం సినిమాకి ముందుగా డిస్‌క్లైమర్‌లో కూడా ప్రస్తావించామన్నారు. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశామన్న ఆయన.. ఇది సంపూర్ణ రామాయణం కూడా కాదని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ యుద్ధకాండను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని.. చిత్రంలో చూపించామని చెప్పారు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన సూచించారు.

కాగా, ప్రభాస్ హీరోగా తెరకెక్కింది ‘ఆదిపురుష్’. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌. రావణుడి క్యారెక్టర్‌లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్ కాగా, అజయ్-అతుల్ సంగీతాన్ని అందించారు. అటు ఈ సినిమా రమొదటి రెండు రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!