Adipurush: 400 కోట్ల క్లబ్‌లో ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’.. తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

|

Jun 21, 2023 | 11:16 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్‌' సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌, రిలీజ్‌ మూడు రోజులు మంచి వసూళ్లు సాధించిన ప్రభాస్‌ మూవీ 4, 5 రోజుల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Adipurush: 400 కోట్ల క్లబ్‌లో ప్రభాస్‌ ఆదిపురుష్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే?
Adipurush
Follow us on

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌, రిలీజ్‌ మూడు రోజులు మంచి వసూళ్లు సాధించిన ప్రభాస్‌ మూవీ 4, 5 రోజుల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటి మూడు రోజుల్లో ఏకంగా రూ. 340 కోట్లు రాబట్టిన ఆదిపురుష్‌ సినిమాకు నాలుగు రోజు కేవలం రూ. 35 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఐదోరోజు దారుణంగా కేవలం రూ. 10.8 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం. ఇప్పటివరకు గ్రాస్ తో కలిపి చూసుకుంటే.. మొత్తం రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆదిపురుష్‌ సినిమా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకు కలిపి రూ. 75.70 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ పండితులు పేర్కొన్నారు.

రామాయణం మహాకావ్యం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. రాముడిగ ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌ నటించారు. ఇక లంకేశుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించాడు. అయితే ఆది నుంచి వివాదాలు ఎదుర్కొంటోంది ఆదిపురుష్‌. ఇక థియేటర్లలోకి వచ్చాక కూడా సినిమాపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చిత్రబృందం వీటిని మార్చేసింది. ఇక చాలా చోట్ల ఆదిపురుష్‌ను బ్యాన్‌ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టడం ఆదిపురుష్‌ యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..