The Kerala Story: తెలుగులోకి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’.. థియేటర్లలో రిలీజ్..

|

May 13, 2023 | 4:18 PM

ట్రేడ్ లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ కచ్చితంగా 250 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ కథానాయికగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతుంది.

The Kerala Story: తెలుగులోకి వచ్చేసిన ది కేరళ స్టోరీ.. థియేటర్లలో రిలీజ్..
The Kerala Story
Follow us on

దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాన్ చేశాయి.. మే 5న విడుదలైన ఈ సినిమా ను కొందరు వ్యతిరేకిస్తుండగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ కచ్చితంగా 250 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ కథానాయికగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతుంది.

దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ నటించారు. కేరళలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ క్యాంపుల్లో పంపించి దేశ వ్యతిరేకులుగా మార్చారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపు తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే శనివారం (మే 13న) ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివాదాలను చుట్టుముట్టిన ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

మే 5న విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ కచ్చితంగా 250 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆదా శర్మ క్రేజ్ సైతం మారిపోయింది. ఇప్పుడీ ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూకట్టినట్లుగా తెలుస్తోంది.