Adah Sharma: వివాదంలో అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’.. షోలు రద్దు.. కారణమిదే

|

Mar 16, 2024 | 11:41 AM

గతేడాది విడుదలైన 'ది కేరళ స్టోరీ' సినిమా నటి అదా శర్మకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది . అలాగే హీరోయిన్ గా ఆమెను బిజీబిజీగా చేసింది. అదే సమయంలో ది కేరళ స్టోరీ సినిమా పలు కారణాలతో వివాదాల్లో నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది

Adah Sharma: వివాదంలో అదాశర్మ  బస్తర్: ది నక్సల్ స్టోరీ.. షోలు రద్దు.. కారణమిదే
Adah Sharma
Follow us on

గతేడాది విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా నటి అదా శర్మకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది . అలాగే హీరోయిన్ గా ఆమెను బిజీబిజీగా చేసింది. అదే సమయంలో ది కేరళ స్టోరీ సినిమా పలు కారణాలతో వివాదాల్లో నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు అదే టీమ్‌తో అదా శర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా చేసింది. శుక్రవారం (మార్చి 15న) విడుదలైన ఈ సినిమా కూడా వివాదాల్లో చిక్కుతుంది . ఇందులోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ప్రదర్శనను రద్దు చేసినట్లు సమాచారం. ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ ‘బస్తర్’ చిత్రానికి కూడా తెరకెక్కించారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమాలో నటించిన చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కూడా నటించారు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అదా శర్మ అద్భుతంగా నటించింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్స్ పోరాటాన్ని ‘బస్తర్’ సినిమాలో చూపించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని డైలాగులు కూడా వివాదాస్పదంగా ఉన్నాయని టాక్. అయితే ఏ అంశం ప్రత్యేకంగా వివాదాస్పదమైందో తెలియాల్సి ఉంది. నివేదికల ప్రకారం, అదా శర్మపై కూడా పోలీస్ కేసు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది. అలాగే బస్తర్ సినిమాను బ్యాన్ చేయాలనే చర్చ కూడా సాగుతున్నట్లు సమాచారం.

‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమాలో హింసాత్మక సన్ని వేశాలు మోతాదుకు మించి ఉన్నాయి. దీంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 4 నిమిషాలు. మొదటి రోజు (మార్చి 15) ఈ సినిమా బుక్ మై షోలో 10కి 8.2 రేటింగ్‌ను పొందింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని నిర్మించిన విపుల్ అమృతలాల్ షా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, యశ్‌పాల్ శర్మ, రైమా సేన, శిల్పా శుక్లా నటించారు. వారాంతంలో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..