ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. విదేశాల్లో సైతం సత్తా చాటింది. ఈ మూవీతో బన్నీ, రష్మిక పాన్ ఇండియా స్తాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.
పుష్ప 2లో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కీలకపాత్రలో నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెతో మేకర్స్ సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అయితే సాయి పల్లవిని ఎంపిక చేసుకునేది రష్మిక పాత్ర కోసం కాదట. సినిమాలోని మరో కీలకపాత్ర కోసం ఆమెను సెలక్ట్ చేసుకున్నారట. ఇందులో ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయే ఓ గిరిజన అమ్మాయి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది.. పూర్తి డీగ్లామర్ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించగలదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఇక అల్లు అర్జున్, సాయి పల్లవి మధ్య దాదాపు 20 నిమిషాల రన్ టైమ్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఆఫర్ ను సాయి పల్లవి అంగీకరిస్తుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె రిజెక్ట్ చేస్తే.. ఈ పాత్ర కోసం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గిరిజన అమ్మాయి పాత్రకు సాయి పల్లవి కాకపోతే ఐశ్వర్య్ కనిపించనుందని తెలుస్తోంది. మరీ చూడాలి ఈ వార్తలలో ఎంతవరకు నిజమనేది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.