
నటుడు షైన్ టామ్ చాకో మలయాళంతోపాటు తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి అలరించాడు. ముఖ్యంగా విలన్ గా వైవిధ్యంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో . అలాగే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ కనిపించాడు. నటుడిగా ఆకట్టుకుంటున్న షైన్ టామ్ చాకో ఇటీవలే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. డ్రగ్స్ కేసుతోపాటు.. మలయాళీ నటి సైతం అతని పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మలయాళ నటి విన్సీ అలోషియస్ ఇటీవల చెప్పిన వీడియో వైరల్ అయ్యింది.
విన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అందులో టామ్ చాకో ఓ సినిమా సెట్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. అయితే ఆమె చెప్పిన నటుడు షైన్ టామ్ చాకో అని వార్తలు వచ్చాయి. టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్య ప్రవర్తించడని ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విన్సీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇంతకు ముందే చెప్పారు.
ఈ విషయంపై షైన్ టామ్ చాకో స్పందించాడు. విన్సీ అతను బహిరంగ క్షమాపణ చెప్పాడు. సినిమా సెట్ లో జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు.. విన్సీకి హాని కలిగించాలన్న ఉద్దేశం నాకు లేదు. విన్సీ నా పై అంత తీవ్రంగా స్పందించడానికి కూడా కారణం ఉందని నేను అనుకుంటున్నా.. ఎవరో ఆమెను బలవంత పెట్టి నన్ను తిట్టించారు అని చెప్పుకొచ్చాడు. అతని పక్కనే ఉన్న విన్సీ షాక్ అయ్యింది.. వెంటనే అతని దగ్గర నుంచి మైక్ తీసుకొని.. చాకో తన పట్ల అలా ప్రవర్తించడం తట్టుకోలేకపోయా. నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నేను అస్సలు ఊహించలేదు. క్షమాపణలు చెప్పడంతో ఆయన్ని క్షమించేశాను.. ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోయింది అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..