AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanti: నిప్పురవ్వ తర్వాత బాలకృష్ణతో అందుకే సినిమాలు చేయలేదు.. అసలు విషయం చెప్పిన విజయశాంతి

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. లేడీ ఓరియేంటేడ్ మూవీస్ తోనూ అలరించారు విజయశాంతి హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు ఆమె. కమర్షియల్ హీరోయిన్ గా కంటే లేడీ ఓరియేంటేడ్ సినిమాలతోనే ఆమె ఎక్కువ పాపులర్ అయ్యారు. తన అందంతో , నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయశాంతి ప్రస్తుతం సినిమాలు తగ్గించారు.

Vijayashanti: నిప్పురవ్వ తర్వాత బాలకృష్ణతో అందుకే సినిమాలు చేయలేదు.. అసలు విషయం చెప్పిన విజయశాంతి
Vijayashanthi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2024 | 11:56 AM

టాలీవుడ్ హీరోయిన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి. హీరోలతో సమానంగా నటిస్తూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది ఈ స్టార్ హీరోయిన్. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. లేడీ ఓరియేంటేడ్ మూవీస్ తోనూ అలరించారు విజయశాంతి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు ఆమె. కమర్షియల్ హీరోయిన్‌గాకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనే ఆమె ఎక్కువ పాపులర్ అయ్యారు. తన అందంతో , నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయశాంతి ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఆమె దాదాపు అందరూ హీరోల సరసన నటించి మెప్పించారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆమె చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఈ జంట స్క్రీన్ మీద తెగ సందడి చేసేవారు. హిట్ పెయిర్ గా చిరు విజయశాంతికి పేరుంది. అయితే విజయశాంతి బాలకృష్ణతోనూ చాలా సినిమాలు చేశారు. అయితే ఒకానొక దశలు బాలయ్య బాబుతో సినిమాలు చేయడం మానేశారు. అప్పటివరకు వరుసగా సినిమాలు చేసిన విజయశాంతి సడన్ గా బాలయ్య సినిమాల్లో కనిపించడం మానేశారు. మిగిలిన హీరోలందరితో చేస్తూ బాలకృష్ణ సినిమాలు మాత్రం ఎందుకు చేయడం లేదు అనేది ఇప్పటికి అభిమానుల్లో మదిలో ఉన్న ప్రశ్న .

దీని పై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు విజయశాంతి. బాలకృష్ణ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలకృష్ణతో విజయశాంతి చివరిగా నిప్పురవ్వ సినిమాలో కనిపించారు. దీని పై ఆమె మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో నటించపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. నిప్పురవ్వ తర్వాత నేను వేరే సినిమాల్లో బిజీ అయ్యాను. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆ సమయంలో నాకు వచ్చిన కథలన్నీ అలాంటివే అందుకు బాలకృష్ణతో నటించడం కుదరలేదు. అంతకు మించి ఏం లేదు అని అన్నారు విజయశాంతి. అలాగే అప్పుడు నేను చేసిన సినిమాలని దాదాపు ఓ హీరో స్థాయి సినిమాలు. ఆ టైం లో రెమ్యునరేషన్ కూడా ఎక్కువే తీసుకున్నా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం వల్ల హీరో ఇమేజ్ వస్తుందని, యాక్షన్ సినిమాలు చేస్తానని అంత బిజీ అవుతానని నేను అనుకోలేదు అందుకే ఇతర హీరోలతో చేయలేకపోయాయను అని అన్నారు విజయశాంతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?