AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : 24 గంటల ఫుటేజ్‏ను గంటలో ఎలా చూపిస్తారు.. అనవసరంగా ట్రోలింగ్ చేస్తారు.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్..

బుల్లితెరపై అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇదివరకు సీజన్ 9 కంప్లీట్ కగా... ఇప్పుడు త్వరలోనే 10వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అగ్నీ పరీక్ష హడావిడి స్టార్ట్ కాగా.. త్వరలోనే ఈ షోను అంగరంగా వైభవంగా మొదలుపెట్టనున్నారు. ఇక ఈసారి సీజన్ సరికొత్తగా ఉండేందుకు నిర్వాహకులు భారీగానే ప్లాన్ చేస్తున్నారని.. అందుకే కంటెస్టెంట్ల ఎంపిక సైతం ఉండనుందని టాక్.

Bigg Boss : 24 గంటల ఫుటేజ్‏ను గంటలో ఎలా చూపిస్తారు.. అనవసరంగా ట్రోలింగ్ చేస్తారు.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్..
Vidyulekha
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2026 | 8:35 AM

Share

బిగ్ బాస్ రియాల్టీ షో.. బుల్లితెరపై విపరీతమైన క్లేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు ఎప్పుడూ వివాదాలు చుట్టిముట్టినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు తెలుగులో 9 సీజన్స్ కంప్లీట్ కగా.. ఇప్పుడు 10వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. కొన్నిరోజులుగా ఈ సీజన్ అగ్నీ పరీక్ష హడావిడి మొదలైంది. మొన్నటివరకు అడిషన్స్ జరగ్గా.. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అగ్నీ పరీక్ష షో స్టార్ట్ కానుందని టాక్. పదవ సీజన్ దశావతారం కావడంతో ఈసారి గేమ్స్, టాస్కులలో కొత్త తరహా ప్లానింగ్ ఉన్నట్లు టాక్. ఈసారి కూడా సామాన్యులతోపాటు.. సెలబ్రెటీలు సైతం రచ్చ చేయనున్నారు. సీరియల్ బ్యూటీలు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ నటి విద్యుల్లేఖ రామన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తనకు కూడా చాలాసార్లు బిగ్ బాస్ నుంచి కాల్స్ వచ్చాయని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

బిగ్‌ బాస్‌ రియాలిటీ షోపై నటి విద్యా లేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌ బాస్‌ అంటే వివాదమే అని, రియల్‌గా ఉన్నవారు అక్కడ నిలదొక్కుకోలేరని ఆమె స్పష్టం చేశారు. “24 గంటలలో జరుగుతున్న విషయాలను 1 గంటలో ఎలా చూపిస్తారు? దీని వెనుక చాలా ఎడిటింగ్‌ ఉంటుంది,” అని విద్యా లేఖ ప్రశ్నించారు. ఒక వాక్యాన్ని ఇక్కడ, మరొక వాక్యాన్ని అక్కడ చేర్చి ప్రసారం చేయడం ద్వారా, ప్రేక్షకులు వాటిని నమ్మి ట్రోలింగ్‌ చేస్తారని ఆమె వివరించారు. వివాదాల నుంచి దూరంగా ఉండడమే తన వ్యక్తిత్వమని విద్యా లేఖ తెలిపారు. తనకు వివాదాస్పద విషయాలలో చిక్కుకోవడానికి ఆసక్తి లేదని, వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం కూడా లేదని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఒక చిన్న స్టేట్‌మెంట్ తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వచ్చే ప్రతిస్పందనను తాను తట్టుకోలేనని, అది ఏ మనిషికైనా భరించలేనిదని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది అటువంటి వాటిని తట్టుకోగలరని, వారికి అభినందనలు తెలిపారు. అయితే, అది తనకు సాధ్యం కాదని, గుడ్‌ వైబ్స్‌ మాత్రమే కోరుకుంటానని విద్యా లేఖ తన వైఖరిని తెలియజేశారు. గతంలో తనకు నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు, తమిళం భాషలలో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కాల్స్ వచ్చాయని.. కానీ ఒక్కసారి కూడా ఆ ఆఫర్ అంగీకరించలేదని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

విద్యుల్లేఖ రామన్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us