Vidya Balan: ఆ టైంలో కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.. విద్య బాలన్ కామెంట్స్

చాలా మంది హీరోయిన్స్ తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్స్ గా మారి పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో విద్య బాలన్ ఒకరు. బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.  బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన  'కహానీ' సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా 2012లో విడుదలైంది. కోల్‌కతా మెట్రోలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Vidya Balan: ఆ టైంలో కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.. విద్య బాలన్ కామెంట్స్
Vidya Balan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 07, 2024 | 10:44 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం అంత ఈజీకాదు. అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణించడం కూడా అంత తేలికైన విషయం కాదు. చాలా మంది హీరోయిన్స్ తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్స్ గా మారి పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో విద్య బాలన్ ఒకరు. బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.  బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన  ‘కహానీ’ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా 2012లో విడుదలైంది. కోల్‌కతా మెట్రోలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 79 కోట్లు రాబట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విద్యాబాలన్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది.

బడ్జెట్ కారణంగా వ్యానిటీ వ్యాన్ సాధ్యం కాలేదు. అందువల్ల రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపింది విద్య. అలాద్దీన్‌ పరాజయం తర్వాత కహానీ సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా చేయాలా వద్దా అని తెగ ఆలోచించా.. అమితాబ్ బచ్చన్ నుంచి షారుక్ ఖాన్ వరకు అందరితో చేశాను. నేను ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే చేసేస్తా అని తెలిపింది. ముందుగా  సుజయ్ ఘోష్  సినిమా చేద్దాం అని చెప్పారు. నీకు దాని గురించి ఏమీ తెలియదు. మాకు ఎలాంటి వ్యానిటీ వ్యాన్‌ కొనే స్థోమత లేదు. అంత పెద్ద బడ్జెట్ కూడా లేదు. నేను బట్టలు మార్చుకోవలసి వచ్చినప్పుడల్లా ఇన్నోవా కారు కిటికీకి నల్లటి గుడ్డ చుట్టి.. ఆ కారులో బట్టలు మార్చుకున్నా అని తెలిపింది.

ఈ సినిమా ఆ షూటింగ్ లో  ఎంతో ఇబ్బంది పడ్డాను. కానీ షూటింగ్ ను ఎంజాయ్ కూడా చేశాను. ఆ సినిమా కోసం అందరు చాలా కష్టపడ్డారు అని తెలిపింది విద్య.  ఫైనల్ గా కహానీ సినిమాతో భారీ విజయాన్నిఅందుకుంది. ప్రస్తుతం  విద్యాబాలన్ హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటుంది. మహిళా ప్రధాన చిత్రాలు చేయాలని ఈ బ్యూటీ చూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విద్య బాలన్ రకరకాల రీల్స్ , వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం