Varalakshmi Sarathkumar: వారిపై మండిపడ్డ జయమ్మ.. అలా చెప్పేవాళ్లకు ఓ బ్యాగ్రౌండ్ ఉండాలంటున్న వరలక్ష్మి శరత్ కుమార్..

తెలుగులో విడుదలైన అనగనగా ఓ అతిథి చిత్రానికి రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగాంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రివ్యూవర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Varalakshmi Sarathkumar: వారిపై మండిపడ్డ జయమ్మ.. అలా చెప్పేవాళ్లకు ఓ బ్యాగ్రౌండ్ ఉండాలంటున్న వరలక్ష్మి శరత్ కుమార్..
Varalakshmi Sarathkumar

Updated on: Feb 12, 2023 | 2:58 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో పవర్ ఫుల్ ఉమెన్ విలన్‏గా మెప్పిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. క్రాక్ సినిమాలో జయమ్మగా విలనిజం పండించిన ఆమె.. ఆ తర్వాత వరుస చిత్రాల్లోనూ నటిస్తోంది. అందమైన పవర్ ఫుల్‏ విలన్‎గా వరలక్ష్మి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి చిత్రంలో ప్రతినాయకురాలిగా ఆమె నటన వేరేలెవల్. ఇందులో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న తమిళ్ చిత్రం కొండ్రల్ పావమ్. తెలుగులో విడుదలైన అనగనగా ఓ అతిథి చిత్రానికి రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగాంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి.. రివ్యూవర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా రివ్యూ చెప్పేవాళ్లకు కనీసం ఓ బ్యాగ్రౌండ్ ఉండాలని అన్నారు.

“ఇటీవల కొత్త సినిమాలు రిలీజ్ కాగానే… అలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అంతేకాదు.. ట్రైలర్, టీజర్ చూసి సినిమాపై వాళ్ల అభిప్రాయానా్ని చేప్పేస్తున్నారు. అర్థం పర్థం లేని రివ్యూలు ఇస్తూ ప్రేక్షకులను తప్పుదొవ పట్టిస్తున్నారు. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లు ఎవరు. సినిమాలో ఇది బాగలేదు.. అది బాగలేదు.. అసలు సినిమాలో సందేహమే లేదంటూ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్లందరినీ నేను ఒక్కటే అడుగుతున్నాను. అసలు మీరూ ఎలాంటి సినిమా ఆశిస్తున్నారు ? ” అంటూ ప్రశ్నించింది. “మొదట్లో అందరూ సినిమాను వినోదం కోసం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మర్చిపోయి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింత ఎక్కువయ్యింది.

సినిమా హిట్టు లేదా ప్లాప్ అని చెప్పడానికి వాళ్లేవరు. అది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మూవీ బాగుందా లేదా అని చెప్పేది కేవలం ఆడియన్స్ మాత్రమే. వారిని సినిమా చూసి ఆనందించనివ్వండి. చెత్త రివ్యూలతో వాళ్లను తప్పుదొవ పట్టించకండి. ఇదొక్కటే నా విన్నపం ” అంటూ చెప్పుకొచ్చింది. సినిమా కలెక్షన్స్ గురించి వాగ్వాదాలకు దిగుతున్నారని.. ఇవన్నీ ఎందుకు ? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్ చేయండి అంటూ రివ్యూవర్స్ కు ఆమె సూచించింది. ఇందుకు సంబందించిన వీడియోను వరలక్మి ఆమె తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.