
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓదెల 2. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. అలాగే హెబ్బా పటేల్, వశిష్ట సైతం ఈ చిత్రంలో కీలకపాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో తమన్నా నాగ సాధు పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఓదెల రైల్వే స్టేషన్ స్టోరీ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే రెండు పార్ట్ స్టార్ట్ కానున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ టీజర్ కు ఇప్పుడు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో తమన్నా శివ శక్తిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది.
దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఓదెల 2 చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది తమన్నా.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన