Tamannaah Bhatia : ‘తమన్నా ఏంటి ఇలా చేసింది అని నా ఫ్యాన్స్ అనుకోకూడదు.. ఎంత డబ్బు ఇచ్చిన ఆ పని చేయను’: తమన్నా

|

May 03, 2022 | 7:09 AM

అందాల భామ తమన్నా భాటియా ... హ్యాపీడేస్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ చిన్నది ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది

Tamannaah Bhatia : తమన్నా ఏంటి ఇలా చేసింది అని నా ఫ్యాన్స్ అనుకోకూడదు.. ఎంత డబ్బు ఇచ్చిన ఆ పని చేయను: తమన్నా
Thamanna
Follow us on

అందాల భామ తమన్నా భాటియా(Tamannaah Bhatia ).. హ్యాపీడేస్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ చిన్నది ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది తమన్నా. దాదాపు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోనూ తమన్నా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల తమన్నా జోరు కాస్త తాగిందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత తమన్నా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో తెలుగులో గుర్తుందా శ్రీతకాలం సినిమా ఉంది. ఈ సినిమా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ భామ వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ మధ్య హిందీలో ఓ ప్రయివేట్ ఆల్బమ్ లో మెరిసింది ఈ భామ.

తమన్నా నటనతోనే కాదు.. తనఅందంతోనూ భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా తమన్నా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. బోల్డ్ క్యారెక్టర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. నాకు సీనియారిటీ  పెరిగింది కాబట్టి దాన్ని కాపాడుకోవడం ఇప్పుడు నా బాధ్యత. అందుకే పాత్రల ఎంపిక విషయంలో చాలా  జాగ్రత్తగా ఉంటున్నాను. నేను సెలక్ట్ చేసుకునే సినిమాలే నా సీనియారిటీని కాపాడతాయి అంటుంది తమన్నా. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి నేను సిద్ధమే. కానీ బోల్డ్ రోల్స్ కు మాత్రం నో చెప్పేస్తా. తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని నా ఫ్యాన్స్ నన్ను ఆదరించే ప్రేక్షకులు అనుకోకూడదు. డబ్బు కోసం అలాంటి రోల్స్ ను ఎప్పటికీ చేయను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

Upasana konidela : 150 వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్న రామ్ చరణ్ సతీమణి..