AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supritha: మా అమ్మకు అలాంటివాడే కావాలి.. సురేఖ వాణి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అమ్మగా, అక్కగా, వదినగా ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు సురేఖావాణి. రెడీ సినిమాలో ఆమె చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూ ఉంటాయి. ప్రస్తుతం సురేఖ వాణి అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వయసు పెరుగుతున్నా తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు.

Supritha: మా అమ్మకు అలాంటివాడే కావాలి.. సురేఖ వాణి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Surekha Vani,supritha
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2024 | 6:39 PM

Share

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సురేఖ వాణి. చాలా సినిమాల్లో ఆమె తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. అమ్మగా, అక్కగా, వదినగా ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు సురేఖావాణి. రెడీ సినిమాలో ఆమె చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూ ఉంటాయి. ప్రస్తుతం సురేఖ వాణి అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వయసు పెరుగుతున్నా తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇక సురేఖ వాణి తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

సురేఖ వాణి వీడియోల పై కొందరు ప్రశంసలు కురిపిస్తే కొంతమంది విమర్శలు చేశారు. కానీ సురేఖ వాణి అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా ప్రేక్షకులకు సుపరిచితురాలే. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది సుప్రీతా..

ఇక తనలానే తన కూతురిని కూడా ఇండస్ట్రీకి పంపించారు సురేఖావాణి. సుప్రీత ప్రస్తుతం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. ఇటీవలే ఆమె హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నాడు. పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన అమర్ దీప్ బిగ్ బాస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే సురేఖ వాని రెండో పెళ్లి చేసుకోనుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. తన తల్లికి రెండో పెళ్లి చేయాలని సుప్రీత కూడా ప్రయత్నిస్తుంది. ఇటీవల ఓ షో కు హాజరైన సుప్రీత.. తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరని.. అంకుల్స్ అయితే తన తల్లికి కరెక్టుగా సెట్ అవుతారని కామెంట్స్ చేసింది. సుప్రీతా మాట్లాడుతూ.. తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి అంకుల్స్ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతారని.. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బాగా చూసుకోవాలని, టాక్సిక్ గా అస్సలే ఉండకూడదని చెప్పుకొచ్చింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తన తల్లికి పెళ్లి చేస్తా అని తెలిపింది సుప్రీత.. అలాగే తన గురించి చెప్తూ.. గతంలో ఓ అబ్బాయిని ప్రేమించానని కానీ అతను చాలా టార్చర్ చేశాడని తెలిపింది.

సుప్రీతా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సుప్రీతా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.