AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు విలన్ అనుకున్నా.. కానీ ఇప్పుడు పెద్ద హీరో అయ్యారు.. సుహాసిని ఆసక్తికర కామెంట్స్

సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అలరించిన అందాల నటి. 80’sలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో సుహాసిని ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

అప్పుడు విలన్ అనుకున్నా.. కానీ ఇప్పుడు పెద్ద హీరో అయ్యారు.. సుహాసిని ఆసక్తికర కామెంట్స్
Suhasini
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2026 | 6:33 PM

Share

సుహాసిని.. ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఎన్నో విభిన్న సినిమాల్లో నటించి మెప్పించారు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజి బిజీగా ఉంటున్నారు. తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటిగా బిజీగా ఉంటున్నారు సుహాసిని. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ స్టార్ హీరో గురించి సుహాసిని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ స్టార్ హీరోను మొదటిగా చూసినప్పుడు అతను విలన్ అనుకున్నాను కానీ ఆయనే హీరో అని తెలిపారు సుహాసిని. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..

మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే

ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. కెరీర్ ప్రారంభంలో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం కాళీ షూటింగ్‌లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో చిరంజీవిని మొదటిసారి కలిశానని సుహాసిని గుర్తుచేసుకున్నారు. అప్పుడు కొత్తగా పెళ్లైన చిరంజీవి ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూలన కూర్చునే వారు అని తెలిపారు. కాగా నటి సుమలతతో కలిసి ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు, సుమలత నన్ను “నువ్వు చిరంజీవితో యాక్ట్ చేస్తున్నావట? అని అడిగితే, సుహాసిని అవును అయితే ఏంటి.?అని అడిగారట. అప్పుడు సుమలత ఆయన తెలుగులో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరో అవుతారు అనగానే, “అయ్యో, చూడడానికి విలన్ లా ఉన్నారే” అని సుహాసిని అన్నారట.

ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని

సుమలత ఆ మాటను చిరంజీవికి చెప్పడంతో, మరుసటి రోజు చిరంజీవి “విలన్ ఫేస్‌తో ఎవరు యాక్ట్ చేస్తారు?” అని సరదాగా ఏడిపించారు అని సుహాసిని అన్నారు. తాను ఎంత సారీ చెప్పినా ఆయన మన్నించలేదని, చివరికి మిత్రులయ్యారని సుహాసిని నవ్వూతూ వివరించారు. ఇక సుహాసిని, చిరంజీవిది సూపర్ హిట్ కాంబినేషన్.. ఈ ఇద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.