
హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది. జయపజయాలతో సంబంధం లేకుండా ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. వయసులో చిన్నదైనా శ్రీలీల మనసు చాలా గొప్పది. అందుకే దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూసుకుంటోంది. ఇది చాలా మంచి పనైనా సాధారణంగా పెళ్లి కానీ అమ్మాయిలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అందుకు చాలా కారణాలున్నాయి. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించింది. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది. ఇప్పటికే ఆ ఇద్దరు పిల్లలకు తల్లిలా ఆలనా పాలన చూసుకుంటోన్న శ్రీలీల మరో పాపను తన ఇంటికి తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంగే ఆమె ఒక చిన్నారికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనికి ‘ మా ఇంటికి మరొకరు, హృదయాలను నింపేందుకు ఈ పాప వచ్చింది’ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ పాప ఎవరు? శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుదందా? లేక తన బంధువుల పాపనా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే చాలామంది శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందంటూ బలంగా చెబుతున్నారు. మరి ఈ విషయంపై శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. ధమాకా తర్వాత మరోసారి ఈ మూవీలో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోనుందీ అందాల తార. దీంతో పాటు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ శ్రీలీలనే కథానాయిక. వీటితో పాటు హిందీలో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమా చేస్తోందీ ముద్దుగుమ్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.