Sreeleela: మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం కష్టం.. వైరలవుతున్న యంగ్ హీరోయిన్ పోస్ట్..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దరకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్శి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ బ్యానర్లపై

Sreeleela: మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం కష్టం.. వైరలవుతున్న యంగ్ హీరోయిన్ పోస్ట్..
Sreeleela

Updated on: Mar 04, 2022 | 10:18 AM

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దరకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్శి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ బ్యానర్లపై కె.కృష్ణ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించారు. ఈ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాతో శ్రీలీల (SreeLeela) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో వరుస ఆఫర్లు శ్రీలీలకు క్యూ కట్టాయి. ఇప్పటికే కన్నడలో పలు చిత్రాల్లో నటించిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యేందుకు ట్రై చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఓవైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. సినిమా అప్డేట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా శ్రీలీల చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ. “మనసు చంచలమైనది..దానిని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం ద్వారా మనసును నియంత్రించవచ్చు. ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం శ్రీలీల రవి తేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

Also Read: Suriya: కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదలకు ఫుల్‏స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..

Aadavallu Meeku Joharlu Twitter Review: ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్.. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలా ఉందంటే..

Director Thirumala Kishore: మహిళలు క్లాప్స్ కొట్టేలా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వుంటుంది.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కామెంట్స్ వైరల్..