Sonali Bendre : క్యాన్సర్ రోజులను గుర్తు చేసుకున్న అలనాటి ముద్దుగుమ్మ..! నొప్పితో బాధపడుతున్న ఫొటో రిలీజ్..

| Edited By: Phani CH

Jun 07, 2021 | 8:53 AM

Sonali Bendre : బాలీవుడ్ అందాల నటి సోనాలి బింద్రే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. క్యాన్సర్

Sonali Bendre : క్యాన్సర్ రోజులను గుర్తు చేసుకున్న అలనాటి ముద్దుగుమ్మ..! నొప్పితో బాధపడుతున్న ఫొటో రిలీజ్..
Sonali
Follow us on

Sonali Bendre : బాలీవుడ్ అందాల నటి సోనాలి బింద్రే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా తన పాత చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2018లో తను క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫొటోను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో సోనాలి చాలా జబ్బుపడినట్లు బాధపడినట్లుగా కనిపిస్తోంది. సోనాలిని చికిత్స కోసం అప్పట్లో అమెరికాకు తరలించారు. సోనాలికి మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈమె న్యూయార్క్‌లో ఉండి క్యాన్సర్‌తో పోరాడి గెలిచి అక్కడి నుంచి తిరిగి వచ్చింది.

ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇలా రాసింది. “సమయం తొందరగా గడుస్తోంది. ఈ రోజు నేను జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే నా బలం, బలహీనత రెండు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా జీవితం ఎలా ఉందో చూసుకుంటే ఆశ్చర్యపోతున్నాను. మీరు మీ జీవితాన్ని కోరుకున్న విధంగా మలుచుకుంటారు కనుక ప్రయాణం చేసేది మీరే అని గుర్తుంచుకోండి. ప్రతి రోజు ఓ కొత్త రోజు ఇంకా చాలా ప్రత్యేకమైనదని” అంటూ తెలిపింది.

దీనికి ముందు సోనాలి బింద్రే తన అనారోగ్యం గురించి చాలాసార్లు బహిరంగంగా మాట్లాడింది. క్యాన్సర్ సమయంలో ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు పట్టుదలతో ముందుకు సాగింది. ఈ పోరాటంలో ఆమె భర్త గోల్డీ బెహ్ల్ ఆమెకు మద్దతు ఇచ్చాడు. అదే సమయంలో అతని కుమారుడు రణవీర్ బహ్ల్ కూడా ఆమెతో న్యూయార్క్ వెళ్ళాడు. ఇప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంది. సోనాలి ఖచ్చితంగా బాగుంది కానీ పాత రోజులను ఎప్పటికీ మరచిపోకూడదని ఆమె తెలిపింది. ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత ఆమె చికిత్స గురించి మాట్లాడుతూ.. తాను బతకడానికి 30 శాతం మాత్రమే అవకాశం ఉందని వైద్యులు తనతో చెప్పారని తెలిపింది. అయినా ఆమె తీవ్రంగా పోరాడింది ఈ కారణంగానే ఆమె ఈ రోజు తన కుటుంబంతో గడుపుతోంది.

Viral Video: ఈ ఏనుగు తెలివి మామూలుగా లేదుగా.. కుంటలో నీటిని కాదని పైపు నోట్లో పెట్టుకుని..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 వ్యాయామాలు రెగ్యూలర్‌గా చేయండి..

Ask KTR : కేంద్రం అనాలోచిత నిర్ణయాలే కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యానికి కారణం.. ‘ఆస్క్ కేటీఆర్‌’‌లో వ్యాఖ్య