Devara Movie: ‘దేవర’ స్టోరీ లీక్ చేసిన మరాఠీ బ్యూటీ.. ఎన్టీఆర్ భార్యగా ఆ హీరోయిన్..

ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవర పై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సరికొత్తగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమాలో జాన్వీతోపాటు.. మరో హీరోయిన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ. తమిళంలో అనేక సినిమాలు చేసిన గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందని ప్రచారం నడిచింది.

Devara Movie: 'దేవర' స్టోరీ లీక్ చేసిన మరాఠీ బ్యూటీ.. ఎన్టీఆర్ భార్యగా ఆ హీరోయిన్..
Devara, Shruti Marathe
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2024 | 2:59 PM

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అంచనాలను మరింత పెంచేశాయి. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవర పై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సరికొత్తగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమాలో జాన్వీతోపాటు.. మరో హీరోయిన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ. తమిళంలో అనేక సినిమాలు చేసిన గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందని ప్రచారం నడిచింది.

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దేవర చిత్రంలో గుజరాతీ అమ్మాయి నటిస్తుందని వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. కొన్నాళ్లుగా వినిపిస్తున్నట్లుగానే దేవర సినిమాలో శ్రుతి మరాఠే నటిస్తున్నట్లు స్వయంగా ఆ ముద్దుగుమ్మే వెల్లడించింది. ఇందులో ఆమె పాత్రతో పాటు దేవర స్టోరీ కూడా లీక్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి మరాఠే మాట్లాడుతూ.. దేవర సినిమాలో తాను నటిస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. అయితే ఆ సినిమాలో తాను దేవరకు భార్యగా కనిపిస్తానని తెలిపింది. అక్టోబర్ 10న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ అభిమానుల మాదిరిగానే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు శ్రుతి చేసిన కామెంట్స్ తో దేవర మూవీపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ దేవర పాత్రలో కనిపించనున్నారు. అలాగే జాన్వీ తంగం పాత్రలో నటిస్తుంది. ఇన్నాళ్లు జాన్వీ, తారక్ జోడీగా కనిపించనున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దేవర భార్యగా శ్రుతి మరాఠే కనిపించనుందని తెలియడంతో.. ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం ఉంటుందని స్పష్టత వచ్చేసింది. అలాగే తారక్ తండ్రికొడుకులుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇటీవల సముద్రంలో షూటింగ్ కు సంబంధించిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు.

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..