Shruti Haasan: చాలా నీరసించిపోయాను.. ఏం చేయాలో తెలియడం లేదు. కోవిడ్‌తో ఇబ్బందిపడుతోన్న శృతీ హాసన్‌.

Shruti Haasan: కరోనా మహమ్మారి (Corona) ప్రభావం తగ్గుముఖం పట్టిందన్న వార్తలు ఊరటనిస్తున్నా మరోవైపు అడపాదడపా నమోదవుతోన్న కేసులు మాత్రం..

Shruti Haasan: చాలా నీరసించిపోయాను.. ఏం చేయాలో తెలియడం లేదు. కోవిడ్‌తో ఇబ్బందిపడుతోన్న శృతీ హాసన్‌.
Shruti Haasan

Edited By:

Updated on: Mar 02, 2022 | 7:13 AM

Shruti Haasan: కరోనా మహమ్మారి (Corona) ప్రభావం తగ్గుముఖం పట్టిందన్న వార్తలు ఊరటనిస్తున్నా మరోవైపు అడపాదడపా నమోదవుతోన్న కేసులు మాత్రం ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా థార్డ్‌ వేవ్‌లో (Third Wave) వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొందరిని తీవ్ర ఇబ్బందికి గురి చేసిందన్న వార్తలు కొంత టెన్షన్ పెట్టాయి. కరోనా కనుమరుగయిందని సంతోషిస్తున్న వేళ ఇటీవల కొందరు సెలబ్రిటీలు కరోనా బారిన పడినట్లు చేసిన పోస్టులతో కరోనా మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా నటి శృతీ హాసన్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిత్రం తనకు కరోనా పాజిటివ్‌గా సోకిందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు శృతీ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే ఎప్పుడూ స్వేచ్ఛగా తిరిగే శృతీ ఒక్కసారిగా ఐసోలేషన్‌లోకి వెళ్లేసరికి బోర్‌గా ఫీలవుతుంది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిమానులతో పంచుకుంది శృతీ. ‘కరోనాతో చాలా నీరసించి పోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు శృతీ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటికి బదులిచ్చిన శృతీ హాసన్‌.. మీ అందరి ఆశీస్సులతో త్వరలో పూర్తిగా కోలుకొని మీ ముందుకు వస్తాను అని సమాధానమిచ్చింది. అయితే ప్రస్తుతం శృతీ హాసన్‌ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉండడంతో ఒంటరిగా ఫీలైన ఈ ముద్దుగుమ్మ అలాంటి పోస్ట్ చేసింది.