AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: మలయాళీ సూపర్ హిట్ రీమేక్‌పై కన్నేసిన నాగ్‌.. మనం తర్వాత అఖిల్‌ మరోసారి.?

Nagarjuna: ఓవైపు రియాలిటీ షోలు (reality shows), మరోవైపు వరుస సినిమాలు ఇలా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు కింగ్ నాగార్జున. యంగ్‌ హీరోలకు..

Nagarjuna: మలయాళీ సూపర్ హిట్ రీమేక్‌పై కన్నేసిన నాగ్‌.. మనం తర్వాత అఖిల్‌ మరోసారి.?
Nagarjuna
Narender Vaitla
| Edited By: |

Updated on: Mar 02, 2022 | 7:45 AM

Share

Nagarjuna: ఓవైపు రియాలిటీ షోలు (reality shows), మరోవైపు వరుస సినిమాలు ఇలా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు కింగ్ నాగార్జున. యంగ్‌ హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాగ్‌. ఇటీవల బంగార్రాజుతో (Bangarraju)మంచి విజయాన్ని అందుకున్న నాగ్‌, తాజాగా బ్రహ్మాస్త్రను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాతో పాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్‌ను పరుగులెట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవ్వక ముందే నాగార్జున మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మొహన్‌ రాజా దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘బ్రో డాడీ’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అఖిల్‌ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇంత వరకు నాగ్‌ చిత్రాల్లో ఎక్కువగా నాగ చైతన్య నటించాడు. కానీ అఖిల్‌ ఒక్క మనం సినిమాలోనే కనిపించాడు. అందులో కూడా అఖిల్‌ది కేవలం గెస్ట్‌ రోల్‌ మాత్రమే. అయితే ఈ మలయాళ రీమేక్‌లో మాత్రం అఖిల్‌ ఫుల్‌ లెంత్‌ పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఇది నాగార్జున 100వ చిత్రం. మరి నాగార్జున కొత్త సినిమా ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ