టాలీవుడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ మల్టీ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో శ్రుతి హాసన్ ముందుంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే.. వీక్షకులను భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకువెళుతున్నట్టుగా ఉంది. ఇక్కడ శృతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ కథానాయికగా కనిపిస్తున్నారు. ఈ డిజిటల్ అద్భుతం భౌతిక, డిజిటల్ రంగాలను మిళితం చేస్తున్నట్టుగా ఉంది. ఈ డిజిటల్ విధానం చూస్తుంటే.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, కొత్త టెక్నాలజీని స్వీకరించడానికి శ్రుతి హాసన్ ఎంతగా ఇష్టపడుతుంటారో అర్థం అవుతోంది.
శ్రుతి హాసన్‌ను ఈ మ్యాగజైన్ “ప్రకృతి శక్తి”గా సముచితంగా వర్ణించింది. మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక శ్రుతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ అడ్వెంచర్, ఆవిష్కరణ, కల్పనతో రూపొందించబడిన భవిష్యత్తును అందిస్తుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నాలకు అతీతంగా శ్రుతి హాసన్ తన సినీ కెరీర్ మీద ఫోకస్‌గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి “కూలీ” చిత్రంతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు.
శ్రుతి హాసన్ తన క్రాఫ్ట్ పట్ల అచంచలమైన అంకితభావంతో ఉంటారు. విభిన్న మాధ్యమాలు, భిన్న కళల ద్వారా శ్రుతి హాసన్ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటారు. శ్రుతి హాసన్ తెరపైనే కాకుండా, సంగీత ప్రదర్శనలతోనూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ ముందుంటారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.