
పాత ఫోటోస్ రోజులు గడిచేకొద్ది మరింత అద్భుతంగా కనిపిస్తుంటాయి. అలాంటి ఒక ఫోటో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో సౌత్ సినీప్రియులకు అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. దశాబ్దాలపాటు సినిమా ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసిన ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తుంది. కానీ పెళ్లి చేసుకుండా ఒంటరిగా లైఫ్ గడుపుతుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శోభన.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
ఒకప్పుడు ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలపాటు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పటికీ సహయ నటిగా కనిపిస్తుంది. శోభన రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. మణిచిత్రతళు, మిత్రు మై ఫ్రెండ్ చిత్రాలలో తన నటనకు జాతీయ అవార్డును గెలుచుకుంది. నటనకు మించి, శోభనకు నృత్యం పట్ల ఉన్న మక్కువ ఆమెను అగ్ర కథానాయికగా నిలబెట్టింది. అంతేకాదు.. శోభన తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసింది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
కొంత విరామం తర్వాత శోభన మలయాళ చిత్రసీమలోకి తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో సినిమాలు చేస్తుంది. మరోవైపు సొంతంగా డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి ఎంతో మంది చిన్నారులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..