
సినీ సెలబ్రెటీలు చాలా మంది చిన్నవయసులో లేదా కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు కొంతమంది తమ సొంతం ఇంట్లో వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని చెప్పి షాక్ ఇచ్చారు. అలాగే కొంతమంది సొంత తండ్రి చేతుల్లోనే లైంగిక వేధింపుల బారిన పడ్డం అని చెప్పి అందరూ షాక్ అయ్యేలా చేశారు. సీనియర్ నటి ఖుష్బూ కూడా తన తండ్రి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపి షాక్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తన తండ్రి వేధించాడని తెలిపి ఎమోషనల్ అయ్యింది. తన తండ్రి ఏంటో అసహ్యంగా మాట్లాడేవాడు అని తెలిపింది. తన అమ్మను తనను ఎంతో నీచంగా మాట్లాడి వేధించేవాడు అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
షైనీ దోషి.. ఈ ముద్దుగుమ్మ టెలివిజన్ నటి, హిందీ సీరియల్స్‌లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఆమె 15 సెప్టెంబర్ 1989న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తర్వాత నటన వైపు మళ్లింది. 2013లో “సరస్వతీచంద్ర” సీరియల్‌లో కుసుమ్ దేశాయ్ పాత్రతో టెలివిజన్‌లో అడుగుపెట్టింది. 2020లో “రాత్రి కే యాత్రి”తో వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టింది.
ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాల గురించి ఇటీవల మీడియాలో వెల్లడించింది, ఇందులో తన తండ్రి నుండి ఎదురైన అవమానాలు కూడా ఉన్నాయి, ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన చిన్నతనంలో తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని, దీంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురై చిన్న వయసులోనే పని చేయవలసి వచ్చిందని చెప్పింది షైనీ. 16 ఏళ్ల వయసులో తన తండ్రి తనను అసభ్యకరంగా “వేశ్య” అని అనేవాడు అని, ఇండస్ట్రీలో ఉండటం ఆయనకు ఇష్టం లేదని, నన్ను మా అమ్మను ఎంతో వేధించేవాడు అని షైనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అనుభవాలు తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన గాయాన్ని మిగిల్చాయని, అయినప్పటికీ తన కష్టాలను అధిగమించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని తెలిపింది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.