అర్రెర్రే.. రంగమ్మత్త పాత్ర ఆ స్టార్ హీరోయిన్ చెయ్యాల్సిందా.! ఎందుకు వదులుకుందో తెలుసా..
రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు.

రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయన్నీ అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఆయనను నటుడిగా మరో మెట్టు పైకెక్కించింది. చిట్టి బాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించాడు చరణ్. చెవిటి వ్యక్తిగా చరణ్ పలికించిన హావభావాలు సినిమాలు హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన విషయం తెల్సిందే. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతన్నీ అందించారు. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అనసూయ నటించింది. రంగమ్మత అనే పాత్రలో అనసూయ నటించి మెప్పించింది. ఈ పాత్రతో అనసూయకు మంచి క్రేజ్ వచ్చింది.
రంగస్థలం సినిమా తర్వాత అనసూయ క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాలతోఫుల్ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. అయితే రంగమ్మత్త క్యారెక్టర్ కోసం ముందుగా అనసూయ ప్లేస్ లో మరో బ్యూటీని అనుకున్నారట సుకుమార్. ఆమె ఎవరో తెలుసా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రాశి ని ముందుగా రంగమత్త పాత్ర కోసం సంప్రదించారట సుక్కు.
అయితే ఆ పాత్ర వస్త్రాలంకరణ నచ్చక ఆమె నొ చెప్పిందని టాక్. సినిమాలో ఆ పాత్ర కట్టుకునే తీరు తనకు నచ్చకపోవడంతో రంగమ్మత్త పాత్రను మిస్ చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇక రాశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన సమయంలో నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు రాశి. ఇక అనసూయ విషయానికొస్తే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది అనసూయ. అంతే కాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. నిత్యం ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ను మతిపోగోడుతుంది ఈ అందాల భామ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.