Samantha:16 ఏళ్ల సమంత ఎలా ఉందో చూశారా ?.. అంతలోనే ఎంత మార్పు..

|

Apr 24, 2023 | 6:40 PM

ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా అప్డేట్స్.. లైఫ్ స్టైల్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక తన గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్.. ట్రోలింగ్స్ పై తనదైన శైలీలో స్పందిస్తుంటుంది.

Samantha:16 ఏళ్ల సమంత ఎలా ఉందో చూశారా ?.. అంతలోనే ఎంత మార్పు..
Samantha
Follow us on

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమంత. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. జెస్సీ పాత్రలో సామ్ నటనకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఒక్కో సినిమాకు తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కొన్నాళ్లుగా ఆమె మానసిక సంఘర్షణ.. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొత్త ప్రయాణం ఆరంభించిన సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. దీంతో కొన్ని నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే చికిత్స తీసుకుంది. ఇటీవలే ఆమె శాకుంతలం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ చిత్రంలో నటిస్తుంది.

ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా అప్డేట్స్.. లైఫ్ స్టైల్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక తన గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్.. ట్రోలింగ్స్ పై తనదైన శైలీలో స్పందిస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఆమె 16 ఏళ్లు ఉన్నప్పటి పిక్ షేర్ చేసింది సామ్. అందులో సామ్ మరింత అందంగా కనిపిస్తుంది. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

Samantha

ఇదిలా ఉంటే.. సామ్ ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇదే కాకుండా..బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ చిత్రంలోనూ నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.