Sai Pallavi: ‘సమస్యలున్నాయి.. అందుకే ఆ సమయంలో చాలా భయపడ్డాను’.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్..

అయితే సినిమాల్లోకి అడుగుపెట్టేముందు సాయి పల్లవి ఎంతో భయపడిందట. అందుకు కారణం తన వాయిస్.. తన ముఖంపై ఉండే మొటిమలే . తన వాయిస్.. ముఖంపై ఉన్న మొటిమలు చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారో అని అనేక సందేహాలు వ్యక్తమయ్యేవని.. కానీ ప్రేమమ్ సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలతో తనపై తనకు నమ్మకం కలిగిందని తెలిపింది.

Sai Pallavi: 'సమస్యలున్నాయి.. అందుకే ఆ సమయంలో చాలా భయపడ్డాను'.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2023 | 4:51 PM

సాయి పల్లవి.. దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్. అందం.. అంతకు మించి సహజ నటనతో ఆడియన్స్ మనసులు దోచుకుంది. ప్రస్తుతం అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అంటే ఆమెనే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. చివరగా.. విరాటపర్వం, గార్గి చిత్రాల్లో నటించిన సాయిపల్లవి.. మరోసారి తన నటనపై ప్రశంసలు అందుకుంది. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టేముందు సాయి పల్లవి ఎంతో భయపడిందట. అందుకు కారణం తన వాయిస్.. తన ముఖంపై ఉండే మొటిమలే . తన వాయిస్.. ముఖంపై ఉన్న మొటిమలు చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారో అని అనేక సందేహాలు వ్యక్తమయ్యేవని.. కానీ ప్రేమమ్ సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలతో తనపై తనకు నమ్మకం కలిగిందని తెలిపింది.

“నేను మొదట్లో చాలా భయపడ్డాను. ఏ పని చేయ్యాలన్నా అనేక సందేహాలు ఉండేవి. ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకునేదానిని. నా వాయిస్.. వస్త్రధారణ.. ముఖంపై ఉండే మొటిమలు.. వీటన్నింటినీ ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనుకున్నాను.. కానీ ప్రేమమ్ సినిమా కోసం డైరెక్టర్ నన్ను ఎంపిక చేశారు. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీ విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి నాపై నాకు నమ్మకం పెరిగింది. నన్ను తెరపై చూసినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పటివరకు నేను నటించిన చాలా సినిమాల్లో మేకప్ లేకుండానే నటించాను.

డైరెక్టర్స్ కూడా నన్ను మేకప్ వేసుకోమని బలవంతం చేయ్యలేదు. మేకప్ లేకుండా నటిస్తాను కాబట్టే నన్ను ఎక్కువమంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు ” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇటీవల జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలలో సాయి పల్లవి పాల్గొంది. ఆమె నటించిన గార్గి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!