Sai Pallavi: మనసులోని మాటను బయటపెట్టిన న్యాచురల్ బ్యూటీ !!.. వెన్నెలకు ఆ కోరిక ఉందంట..
ఇక ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గార్గి. ఈ మూవీ రేపు (జూలై 15న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల గార్గి మూవీ ప్రమోషన్లలో పాల్గోన్న సాయి పల్లవి తన మనసులోని మాటను బయటపెట్టింది.

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. దక్షిణాది చిత్రపరిశ్రమలలో ఈ ముద్దుగుమ్మకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే విరాట పర్వం సినిమాతో మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించింది. ఇక ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గార్గి. ఈ మూవీ రేపు (జూలై 15న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల గార్గి మూవీ ప్రమోషన్లలో పాల్గోన్న సాయి పల్లవి తన మనసులోని మాటను బయటపెట్టింది.
గార్గి ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి. తనకు నిర్మాత కావాలనే కోరిక ఉందని వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. మంచి ప్రాజెక్ట్ వస్తే నిర్మించేందుకు తాను సిద్దమని..తనకు నచ్చే మంచి స్క్రిప్ట్ వస్తే నిర్మాతగా మారతానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. గార్గి సినిమాలో ఆమె ఓ హైస్కూల్ టీచర్ పాత్రలో కనిపించనుంది. తన తండ్రి తప్పుడు కేసులో అరెస్ట్ కావడం.. అతడిని విడుదల చేయడానికి ఆమె ఎదుర్కొనే పరిస్థితులు.. చివరకు తండ్రిని ఎలా విడిపించుకుందనేదే గార్గి చిత్రం. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోస్ చూసిన నెటిజన్స్ సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపించారు.