Renu Desai: మరో హీరోయిన్‌కు హెల్త్ ఇష్యూస్‌.. ఆ అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న రేణుదేశాయ్.. షాక్ లో ఫ్యాన్స్

|

Feb 14, 2023 | 2:55 PM

ప్రముఖ నటి, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ సోషల్‌ మీడియా వేదికగా సంచలన పోస్ట్‌ షేర్‌ చేశారు.

Renu Desai: మరో హీరోయిన్‌కు హెల్త్ ఇష్యూస్‌.. ఆ అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న రేణుదేశాయ్.. షాక్ లో ఫ్యాన్స్
Actress Renu Desai
Follow us on

ప్రముఖ నటి, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ సోషల్‌ మీడియా వేదికగా సంచలన పోస్ట్‌ షేర్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘శ్రేయోభిలాషులారా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నేను గత కొన్నేళ్లుగా గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఈ క్రమంలోనే వాటిని ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకునేందుకు, బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. నేను మాత్రమే కాదు నాలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు బలంగా నిలబడాలని, వారిలో సానుకూల దృక్పథం నింపేందుకే ఇప్పుడు ఈ పోస్ట్ పెడుతున్నాను. ఎలాంటి కఠిన పరిస్థితులు ఉన్నాసరే ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఓ రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితంతో పాటు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకు ఎన్నో సర్‌ప్రైజులు ప్లాన్‌ చేసి ఉంచింది. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే వాటిని నవ్వుతూ ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మెడిసిన్స్‌ తీసుకుంటున్నాను. యోగా చేస్తున్నాను. పోషకాహారం తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మాములు మనిషిలా తిరిగొస్తాను’ అని తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు రేణు దేశాయ్‌.

ప్రస్తుతం  రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్  పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు షాక్‌కు గురువుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు. కాగా హీరోయిన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా  గుర్తింపు తెచ్చుకున్నారు. రేణు దేశాయ్. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతలోనే  తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..