Rashmika Mandanna: జీవితం చాలా చిన్నది.. వాటిని చెంతకు రానివ్వకండి.. రష్మిక మందన్నా ఆసక్తికర పోస్ట్..
కొద్ది రోజులుగా రష్మికపై నెటిజన్స్ సీరియస్ అవుతూ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారికి సమయం వచ్చినప్పుడల్లా కౌంటర్స్ ఇస్తుంది ఈ నేషనల్ క్రష్. తాజాగా మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసి నెట్టింట హల్చల్ చేస్తుంది.

అతి తక్కువ సమయంలో అగ్రకథానాయికగా స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా. కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో నటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుని.. దక్షిణాది టూ ఉత్తరాది వరుస చిత్రాలతో తెగ బిజీ అయ్యింది. మిషన్ మజ్ను సినిమాతో నార్త్ ఆడియన్స్ ను అలరించిన ఈ చిన్నది..ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. అయితే నటనపరంగా ప్రశంసలు అందుకున్నా.. నిత్యం వివాదాలతో వార్తలలో నిలుస్తుంటుంది. కొద్ది రోజులుగా రష్మికపై నెటిజన్స్ సీరియస్ అవుతూ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారికి సమయం వచ్చినప్పుడల్లా కౌంటర్స్ ఇస్తుంది ఈ నేషనల్ క్రష్. తాజాగా మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసి నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఇంతకీ మ్యాటరెంటంటే.. “సంతోషంగా ఉండండి.. ఆశను ఎప్పటికీ కోల్పోవద్దు. ఆనందం, శాంతి అన్నింటికంటే ఎక్కువే వస్తాయి.. జీవితం చాలా చిన్నది.. అందులోకి నెగిటివ్ ఫీలింగ్స్ రానివ్వకండి ” అంటూ సంతోషంగా నవ్వుతున్న ఫోటో షేర్ చేసింది. అయితే రష్మిక పోస్ట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ఎంకరేజ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం మళ్లీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.




ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది.
Be happy peeps.. keep hope.. your happiness and peace comes above all… Life is just too short for negative feels❤️? pic.twitter.com/QHHeYAtvQY
— Rashmika Mandanna (@iamRashmika) February 7, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
