Rashmika Mandanna: అందుకోసం ప్రత్యేకంగా మరాఠీ నేర్చుకుంటోన్న రష్మిక.. ఈ బ్యూటీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

|

Aug 06, 2024 | 10:18 PM

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నకు ఇప్పుడు ఫుల్ బిజీబిజీగా ఉంటోంది. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించిన ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక బాలీవుడ్‌లోనూ రష్మిక దూసుకుపోతోంది. ఇప్పుడు విక్కీ కౌశల్‌తో కలిసి ‘చవ్వా’ సినిమాలో నటిస్తోందీ కన్నడ ముద్దుగుమ్మ.

Rashmika Mandanna: అందుకోసం ప్రత్యేకంగా మరాఠీ నేర్చుకుంటోన్న రష్మిక.. ఈ బ్యూటీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Rashmika Mandanna
Follow us on

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నకు ఇప్పుడు ఫుల్ బిజీబిజీగా ఉంటోంది. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించిన ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక బాలీవుడ్‌లోనూ రష్మిక దూసుకుపోతోంది. ఇప్పుడు విక్కీ కౌశల్‌తో కలిసి ‘చవ్వా’ సినిమాలో నటిస్తున్న ఆమె ఈ సినిమా కోసం మరాఠీ నేర్చుకున్నట్లు సమాచారం. ఇది హిందీ సినిమా. అయినప్పటికీ, పాత్ర కోసం మరాఠీ నేర్చుకోవడం అవసరం. ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా ‘చవ్వా’ సినిమా తెరకెక్కుతోంది. శివాజీ కుమారుడు శంభాజీ మరాఠీ వీరుడు. శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించనుంది. ఈ సినిమాలో చాలా డైలాగులు మరాఠీ భాషలో ఉంటాయి. కాబట్టి నటీనటులు మరాఠీ నేర్చుకుంటున్నారు. ‘చవ్వా’ సినిమాలో పాత్రకు రష్మిక మందన్నతన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుంది. కాబట్టి ఆమె మరాఠీ డైలాగులను సరిగ్గా పలకాల్సి ఉంది. అందుకే రష్మిక 4 వారాల పాటు ప్రత్యేక శిక్షణ పొంది మరాఠీ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. చవ్వా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్నారు.

సౌత్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లోనూ క్రేజ్ పెరుగుతోంది. యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుందీ అందాల తార. అలా హిందీ సినీ ప్రియులకు రష్మిక అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘చవ్వా’. తాజాగా విక్కీ కౌశల్ ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలోని ‘తోబా తోబా..’ పాటతో సంచలనం సృష్టించాడు. అతని డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. రష్మిక మందన్న, విక్కీ కౌశల్ గతంలో ఒక ప్రకటనలో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. అయితే ఆ యాడ్ వివాదం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

విక్కీ కౌశల్ తో రష్మిక మందన్నా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.